
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో డాక్టర్ మజార్ అలీఖాన్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని తన ఇంట్లో కుటుంబ కలహాలతో మజార్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలైన మజార్ ను కుటంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మజార్ ఎంఐఎం అధినేత అసుదద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీకి బంధువు. ఈ విషయం తెలిసుకున్న అసదుద్దీన్, అక్బరుద్దీన్ అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు.