ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీ రహమత్ బేగ్ బహిష్కరణ

ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీ రహమత్ బేగ్ బహిష్కరణ
  •     వీడియో లీక్ వివాదమే కారణం

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌‌‌‌ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తున్నట్లు ఎంఐఎం తన ఎక్స్‌‌ ఖాతాలో పోస్ట్‌‌ చేసింది.  ఒక వీడియో లీక్ వివాదానికి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్లు పార్టీ సంయుక్త కార్యదర్శి ఎస్.ఏ. హుస్సేన్ అన్వర్ తెలిపారు. రహమత్ బేగ్‌‌‌‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడంతో పాటు, తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేసి మండలి చైర్మన్‌‌‌‌కు సమర్పించాలని పార్టీ ఆదేశించింది. 

అయితే, ఈ వివాదానికి కారణమైన వీడియో లీక్‌‌‌‌కు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం పార్టీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.