
తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ(KCR family)ని మోడీ సర్కార్ టార్గెట్ చేసిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఆరోపించారు. మార్చిన 11న ఎంపీ అసదుద్దీన్ ట్విట్టర్‌లో ఇదే విషయాన్ని పేర్కొన్నారు. దేశంలోని ముస్లింలను ఆర్థికంగా వెలివేయాలని బీజేపీ ఎంపీలు(BJP MPs) పిలుపునిచ్చినట్లు అసద్ ఆరోపించారు. ముస్లింలను ఎదుర్కొనేందుకు ప్రజలు తమ ఇండ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాలని పిలుపునిచ్చినట్లు ఆరోపించారు.
మరోవైపు బీజేపీ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని(Telangana govt), సీఎం కేసీఆర్ (CM KCR) కుటుంబాన్ని కక్ష్య సాధింపు ఉద్దేశంతోనే మోడీ సర్కార్ టార్గెట్ చేసినట్లు ఎంపీ అసద్ ట్వీట్‌లో ఆరోపించారు.