3 లోక్ సభ సీట్లకు MIM పోటీ

3 లోక్ సభ సీట్లకు MIM పోటీ

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. మూడు లోక్ సభ స్థానాల నుంచి పోటీకి రెడీ అవుతుంది ఎంఐఎం పార్టీ. ఈ మేరకు పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఆ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ అసదుద్దీన్ హైదరాబాద్ నుంచే పోటీ చేయనున్నారు. మిగతా రెండు సీట్లలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మూడోది బీహార్ రాష్ట్రం కిషన్ గంజ్ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. 

అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి ఐదో సారి బరిలోకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఔరంగాబాద్ ఎంపీ సీటును ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ గెలుచుకున్నాడు. తిరిగి మళ్లీ అతన్నే బరిలోకి దించాలని ఎంఐఎం పార్టీ నిర్ణయించింది. ఇక బీహార్ రాష్ట్రం కిషన్ గంజ్ స్థానంలో 2019 ఎన్నికల్లో మంచి ఓట్లు రాబట్టుకుని మూడో స్థానంలో నిలిచింది. ఈసారి కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని ఎంఐఎం పార్టీ భావిస్తుంది. 

ప్రస్తుతం లోక్ సభలో ఎంఐఎం పార్టీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు.. రాబోయే ఎన్నికల్లో ఆ సంఖ్యను మూడుకు పెంచుకోవాలని భావిస్తుంది. హైదరాబాద్ తోపాటు ఔరంగాబాద్ సీటును తిరిగి నిలబెట్టుకోవటంతోపాటు కిషన్ గంజ్ స్థానంలో గెలవాలని వ్యూహం రచిస్తుంది.