మణుగూరులో మినీ మేడారం జాతర షురూ

 మణుగూరులో మినీ మేడారం జాతర షురూ

మణుగూరు, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మణుగూరులోని మినీ మేడారంలో కూడా జాతరను వైభవంగా నిర్వహిస్తారు. తోగ్గూడెంలో కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరకు గద్దెల వద్ద ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు.

మండెమెలుగు కార్యక్రమంతో జాతరకు శ్రీకారం చుట్టిన గిరిజన పూజారులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు బుధ, గురు, శుక్రవారం పూర్తిగా మేడారం సంప్రదాయాలను అనుసరించి సమీప అటవీ ప్రాంతం నుంచి అమ్మవార్లను గద్దెలపైకి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా మణుగూరు తహసీల్దార్ రాఘవరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు చూస్తున్నారు.