పాకెట్లో, పర్సుల్లో మినీ శానిటైజర్‌

పాకెట్లో, పర్సుల్లో మినీ శానిటైజర్‌

హైదరాబాద్, వెలుగు: సిటిజన్స్ లైఫ్‌ స్టైల్ను కరోనా చేంజ్ చేసింది. వైరస్ను అడ్డుకోవాలంటే ఫిజికల్‌ డిస్టెన్స్ తో పాటు మాస్క్, శానిటైజర్ కంపల్సరీ అయ్యాయి. ఏ వస్తువును టచ్ చేసినా వెంటనే చేతులు శానిటైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పర్స్, వాచ్, కీ చెయిన్, మొబైల్ తీసుకెళ్లినట్లే ఇప్పుడు శానిటైజర్ను కూడా వెంట ఉంచుకోవాల్సి వస్తోంది. దాంతో సేల్స్ కూడా బాగా పెరిగాయి. లాక్ డౌన్ మొదలు మెడికల్ షాపులు, సూపర్ మార్కెట్లలో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. చాలామంది ఆన్‌లైన్‌లో చూస్తూ సొంతంగా ఇంట్లోనూ చేసుకుంటున్నారు. డిమాండ్ పెరగడంతో కంపెనీలు కూడా డిఫరెంట్ సైజులు, ఫ్లేవర్లలో తయారుచేస్తున్నాయి. ఈజీగా క్యారీ చేసే చాన్స్ ఉండడంతో పాకెట్ శానిటైజర్లపై ఎక్కువ మంది ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. స్మాల్డివైజ్ల రూపంలోనూ డిఫరెంట్గా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆన్‌లైన్‌తోపాటు బయట వీటి సేల్స్ ఎక్కువయ్యాయి. వాటిలో జల్, లిక్విడ్, స్ప్రే లిక్విడ్, ఫాగ్ శానిటైజర్ వంటివి డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో అందుబాటులోకి వచ్చాయి.

డిఫరెంట్ మోడల్స్లో..

ఆఫీసులు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, స్టోర్స్లో శానిటైజర్ స్టాండ్స్ ఉంటున్నాయి. కంపెనీలు తమ ఎంప్లాయీస్ కి మినీ శానిటైజర్లు ఇస్తున్నాయి. చాలామంది సొంతంగానూ క్యారీ చేస్తున్నారు. 40 రూపాయల నుంచి 500 పైగా రేట్లలో దొరుకుతున్నాయి. డైలీ వందకిపైగా అమ్ముతున్నట్లు మెడికల్ షాప్ నిర్వాహకుడు సంతోశ్‌ తెలిపాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి