బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలె

బీసీలకు 42శాతం  రిజర్వేషన్లు అమలు చేయాలె
  • ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలె

  • మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్

హైదరాబాద్​: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ డిమాండ్​చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ  రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే తెలంగాణలో స్థానిక సంస్థలు ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.  రిజర్వేషన్లు కేటాయించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను హుటాహుటిన జరపాలని చూస్తున్నాయన్నారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 22%  రిజర్వేషన్లు  మాత్రమే ఇచ్చి రాజ్యాధికారం దక్కకుండా అన్యాయం చేసిందన్నారు.  

తెలంగాణలో బీసీల హక్కుల కోసం ఎంతోమంది గొప్ప పోరాటాలు చేశారన్నారు.రాజకీయాలు అతీతంగా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. బీసీ కులాల పునాదులకే నష్టం కలుగుతుండడంతో నాయకులంతా ఒక తాట మీదికి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు బీసీ సంఘాల నాయకులదరూ కలిసి నడవాలన్నారు.