హైదరాబాద్ బ్రాండ్ ఏ ఒక్క ప్రభుత్వానిది కాదు

హైదరాబాద్ బ్రాండ్ ఏ ఒక్క ప్రభుత్వానిది కాదు

హైదరాబాద్ బ్రాండ్ ఏ ఒక్క పార్టీది, ఏ ఒక్క ప్రభుత్వానిది కాదన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ప్రపంచంలోనే సురక్షితమైన ప్రాంతమన్నారు . HICC లో హైసియా ఆధ్వర్యంలో జరిగిన బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణ పెట్టుబడులకు అనువైన ప్రాంతమన్నారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని… అందుకే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ప్రభుత్వ పన్నువిధానాలు నచ్చి హైదరాబాద్ లో అమెజాన్ పెట్టుబడులు పెట్టిందన్నారు కేటీఆర్.

విశ్వ నగరం అనేది కేవలం రోజుల్లో, నెలల్లో పూర్తి అయ్యేది కాదని…చాలా సంవత్సరాలు పడుతుందన్నారు. హైదరాబాద్ లో సమస్యలు ఉన్నాయన్న మాట నిజమేనన్నారు .వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. నాలాల అక్రమణ గతంలో జరిగింది ఇపుడు కూడా జరుగుతుందన్నారు. తాగు నీటి సమస్య 90% తీరిందని…గతంలో 14 రోజులకు ఒకసారి వాటర్ వచ్చేవి…ఇపుడు డే బై డే వస్తున్నాయన్నారు. పవర్ సమస్యలు కూడా అధిగమించామన్నారు. ఇపుడు కరెంట్ సమస్యలు లేవన్నారు. సోషల్ మీడియాలో విచిత్రమైన చర్చలు జరుగుతున్నాయన్నారు. వర్షం పడితే…విశ్వ నగరం ఇదేనా, బంగారు తెలంగాణ ఇదేనా అంటూ విమర్శలు చేస్తున్నారన్నారు.. వాళ్ళు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. తాము హైదరాబాద్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. గత ఆరేళ్లుగా నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఓట్ల కోసం నగరంలో చిల్లర రాజకీయాలు చేయొద్దన్నారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బ తీయొద్దన్నారు. ఓల్డ్ సిటీ లో కూడా మెట్రో ప్లాన్ చేస్తున్నామన్నారు. డ్రైనేజి & నాలాల అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయని సమయం పడుతుందన్నారు.

హైదరాబాద్ ది 400 ఏళ్ల చరిత్ర అని అన్నారు కేటీఆర్. హైదరాబాద్ భారత్ లో అత్యంత అరుదైన నగరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ అందరినీ ఆకర్షిస్తుందన్నారు. ఆరేళ్ల కింద హైదరాబాద్ లో అనేక సమస్యలుండేవన్నారు. తమకు హైదరాబాద్ లో గొడవలు వద్దని..అభివృద్ధి కావాలన్నారు. తెలంగాణ వచ్చాక ఇక్కడ ఉన్న ప్రతీ బిడ్డ ఈ గడ్డకు చెందిమ వాడేనని సీఎం కేసీఆర్ ఆనాడే చెప్పారన్నారు. నొయిడా గజియాబాద్ లాంటి ప్రాంతాలు కాదని హైదరాబాద్ కు పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రశాంత వాతావరణంలో పరిపాలిస్తున్నారన్నారు.  హైదరాబాద్ నగరాన్ని అత్యన్నత స్థాయికి తీసుకెళ్లడనే తమ లక్ష్యమన్నారు.