కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న మంత్రి అడ్లూరి

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న మంత్రి అడ్లూరి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్నను శుక్రవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి కుటుంబ సభ్యులతోరావడంతో అర్చకులు పూర్ణకుంభంతో ఆయనను స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి పట్నాలు వేసి, స్వామికి బోనం చెల్లించారు. ఆనంతరం ఆలయ అర్చకులు లడ్డూ ప్రసాదం అందజేసి స్వామి ప్రతిమను బహూకరించి సన్మానించారు.  ఆలయ ఈవో వెంకటేశ్,  ఉత్సవ కమిటీ చైర్మన్ గంగం నరసింహారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు వారి వెంట ఉన్నారు. 

 ఎంపీ కోమటిరెడ్డి ఇచ్చిన వాటర్ ప్లాంట్ ప్రారంభం

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు మల్లన్న ఆలయానికి ఎంపీ లాడ్స్ తో వాటర్ ప్లాంట్ మంజూరు చేయగా శుక్రవారం టెంపుల్ చైర్మన్ నర్సింహ్మరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ ప్రారంభించారు.