స్టూడెంట్లకు వందశాతం స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వాలి

స్టూడెంట్లకు వందశాతం స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వాలి
  • కేంద్రానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ వినతి
  • ఎస్సీ హాస్టళ్లకు ఫండ్స్‌‌‌‌‌‌‌‌ కేటాయించాలని రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి చెందిన విద్యార్థులు ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని, అలాంటి ప్రతిభావంతులందరికీ 100 శాతం స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్ ఇవ్వాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ‘వికసిత్ భారత్-2047’ దిశగా సమాజంలోని మార్జినలైజ్డ్ సెక్షన్ల అభివృద్ధి రోడ్‌‌‌‌‌‌‌‌మ్యాప్ రూపకల్పనలో భాగంగా గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రి వీరేంద్ర కుమార్‌‌‌‌‌‌‌‌ అన్ని రాష్ట్రాల సంక్షేమ మంత్రులతో మాట్లాడారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రం తరఫున అడ్లూరి పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యారంగం.. దేశంలోనే ప్రత్యేక స్థానం సంపాదించిందని, దీనిని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం సహకారం అందించాలని విన్నవించారు. రాష్ట్రంలో ఎస్సీ హాస్టళ్లు పురాతన స్థితిలో ఉన్నందున, కొత్తగా ఆధునిక హాస్టళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలన్నారు. ఫ్రీ మెట్రిక్​, పోస్ట్ మెట్రిక్​ హాస్టల్స్‌‌‌‌‌‌‌‌లో చదువుకునే విద్యార్థులకు కేంద్రం తన వాటాగా అందించే స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లను 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని కోరారు. 

కేంద్రం ఇచ్చే సాయం పెంచాలి

ఎస్సీలలో చాలామందికి ఇల్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఎస్సీలే అధికంగా ఉన్నందున పేదలకు గృహనిర్మాణంలో కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. వృద్ధాప్య పింఛన్లలో కేంద్రం 68–79 ఏండ్లవారికి నెలకు రూ.200, ఎనభై ఏండ్లు పైబడినవారికి రూ.500 మాత్రమే ఇస్తోందని.. ఈ సాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.