ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం : మంత్రి దామోదర రాజనర్సింహ

ప్రజలకు  మెరుగైన వైద్యసేవలు అందించడంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం : మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఫార్మసిస్టుల సేవలు కీలకమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వరల్డ్ ఫార్మసిస్టు డే సందర్భంగా బంజారాహిల్స్ లోని క్యాంప్ ఆఫీసులో మంత్రి దామోదరను ఫార్మసిస్టులు కలిశారు.

 ఈ సందర్భంగ మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫార్మసిస్టులతో కలిసి మంత్రి కేక్ కట్ చేశారు.ప్రభుత్వ హాస్పిటళ్లలో 730కి పైగా ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.