బ్లాక్​మెయిలర్లకు బ్రాండ్​ అంబాసిడర్​ కేటీఆర్

బ్లాక్​మెయిలర్లకు బ్రాండ్​ అంబాసిడర్​ కేటీఆర్
  •     అధికారం పోయినా అహం పోలేదు
  •     తీన్మార్​ మల్లన్నను గెలిపించుకుందాం
  •     పంచాయతీ రాజ్ ​శాఖ మంత్రి సీతక్క
  •     ప్రతి ఓటుకు న్యాయం చేస్తా : అభ్యర్థి తీన్మార్​ మల్లన్న

ములుగు, వెలుగు : అధికారం పోయినా బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​కు అహం పోలేదని, అతడు బ్లాక్​మెయిలర్లకు బ్రాండ్ ​అంబాసిడర్​అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ​ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం ములుగు మండలం ఇంచర్లలోని ఎంఆర్​ గార్డెన్స్​లో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్​ అధ్యక్షతన జరిగిన వరంగల్– ఖమ్మం– నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రితో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న హాజరై మాట్లాడారు.

సీతక్క మాట్లాడుతూ ప్రజలు అధికారాన్ని దూరం చేసినా ఎమ్మెల్యే కేటీఆర్​కు అహంకారం పోలేదన్నారు. కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్​ మల్లన్నకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు. మల్లన్న మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్​ రెడ్డి దొంగ ఓట్లతో గతంలో ఎమ్మెల్సీగా, మొన్న ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే వేసిన ప్రతి ఓటుకూ న్యాయం చేస్తానని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్, నియోజక వర్గ ఇన్​చార్జి కూచన రవళి రెడ్డి, డాక్టర్ పులి అనిల్ పాల్గొన్నారు.