తెలంగాణపై మహారాష్ట్ర ఎఫెక్ట్

తెలంగాణపై మహారాష్ట్ర ఎఫెక్ట్

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ ఎఫెక్ట్ తెలంగాణాపై ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ‘మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణాకు మహారాష్ట్ర నుంచి వచ్చి పోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించారు. మనదగ్గర లాక్‌డౌన్, కర్ఫ్యూ పెట్టె పరిస్థితి లేదు. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలి. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మెడికల్ కాలేజీల్లో కరోనా ట్రీట్మెంట్ కోసం సాదారణ బెడ్ల‌తో పాటూ, ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లు కూడా సిద్ధం చేసుకోవాలి’ అని మంత్రి ఈటల అన్నారు. కాగా.. మంత్రి ఈటల కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం మధ్యాహ్నం కోఠి ఆస్పత్రిలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించనున్నారు.