‘కరోనా సెకండ్‌ వేవ్ మొద‌లైంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

‘కరోనా సెకండ్‌ వేవ్ మొద‌లైంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

జనగామ: కరోనా సెకండ్ వేవ్ మొద‌లైంద‌ని, చలి కాలం కారణంగా వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం వుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా వుండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ‌రావు సూచించారు. ఇంట్లోంచి బయటకు వెళ్లినపుడు మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని అరికట్టవచ్చని, ప్రజలు వాటిని పాటించాలని సూచించారు. జనగామ జిల్లాలో నిర్మాణంలో వున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కొద్ది రోజుల్లోనే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామ‌ని, త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల చేతుల మీదుగా ప్రారంభింప చేస్తామన్నారు. కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యమైందని…. అతి త్వరలో కార్యాలయాన్ని పూర్తి చేసి కార్యకర్తలకు,నాయకులకు అందుబాటులోకి తెస్తామన్నారు.