ఉపాధి హామీకి ఫండ్స్ తగ్గించటం బాధాకరం

ఉపాధి హామీకి ఫండ్స్ తగ్గించటం బాధాకరం

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకానికి నిరుడు బడ్జెట్​లో రూ. 98 వేల కోట్లు కేటాయించగా, ఈసారి రూ.73 వేల కోట్లకు తగ్గించడం బాధాకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరోనా వల్ల నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కీమ్​తో ఉపాధి పొందుతున్నారని, నిధులు తగ్గించి కేంద్రం వాళ్లకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తోందన్నారు. బుధవారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఉపాధి హామీ పథకం రాష్ట్ర కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంట్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ క్యాలెండర్​ను, డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉపాధి హామీలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ  కడియం శ్రీహరి, రఫీ సయ్యద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.