సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామాల అభివృద్ధి: మంత్రి ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామాల అభివృద్ధి: మంత్రి ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమకొండ కలెక్టరెట్ లో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన పంచాయతీలకు జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. మార్చి 25 శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అథితిగా హాజరైయ్యారు. రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ది చెందుతున్నా.. అవార్డులు అందుకుంటున్నా.. విపక్షాలు మాత్రం విమర్శిస్తూనే ఉంటాయని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

15వ ఆర్థిక సంఘంలో గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను తగ్గించిందన్నారు మంత్రి ఎర్రబెల్లి. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.707 కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు.  ఉపాధి హామీ నిధులు కేంద్రం నుంచి రూ.600 కోట్ల బకాయిలు రావాలి తెలిపారు మంత్రి ఎర్రబెల్లి. తెలంగాణపై  కేంద్ర ప్రభుత్వం నీచంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 8 ఏళ్లలో తెలంగాణ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ఇస్తే...కేంద్రం రూ. 4,350 కోట్లు మాత్రమే ఇచ్చిందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.