మహిళలు ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుంది

మహిళలు ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుంది

మహిళల ఆత్మగౌరవం పెంచేవిధంగా సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‎ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని ఆడిటోరియంలో  స్త్రీనిధి 9వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన.. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. గతంలో రూ. 33 కోట్ల రూపాయలున్న శ్రీనిధి వార్షిక టర్నోవర్ 5వేల కోట్లకు చేరిందని ఎర్రబెల్లి అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందని ఆయన అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన స్త్రీనిధి ఉద్యోగులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు.

For More News..

గురుకుల స్కూళ్లో 44 మంది విద్యార్థులకు అస్వస్థత

ఏపీలో కరెంట్ బిల్లుల పెంపు.. తెలంగాణకు ఏపీకి తేడా ఇదే!

ప్రభుత్వ వాహనాలకు కూడా స్టిక్కర్లు తీసేయాలి

ఈటల లేని పార్టీ తండ్రి లేని కుటుంబంలా మారింది

వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన కోదండరాం