వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నరు

వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నరు

వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 41 కులాలకు నగరం నడిబొడ్డున వేల కోట్లు విలువ చేసే భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిందన్నారు. భవన నిర్మాణాలకు కూడా ఆయా కుల సంఘాలకే అప్పగించి నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. అన్ని కుల సంఘాలు ఏక సంఘాలుగా ఏర్పడాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాలంతా ఐక్యంగా ఉండాలన్నారు. కులంలో ఎదిగే వాళ్లకు అండగా నిలబడాలి కానీ అడ్డుపడకూడదని చెప్పారు. హైదరాబాద్ లో 6 కుల సంఘాలకు ఆత్మగౌరవ నిర్మాణ పత్రాలను మంత్రులు అందించారు.