ఫ్రీ కోచింగ్‎తో పాటు రూ. 5 వేల స్టైఫండ్

ఫ్రీ కోచింగ్‎తో పాటు రూ. 5 వేల స్టైఫండ్

ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు మంత్రి గంగుల కమలాకర్ గుడ్ న్యూస్ చెప్పారు.  బీసీ వెల్ఫేర్ డిపార్ట్‎మెంట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వీటి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షా 25 వేల మంది విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తామన్నారు. మొత్తం 16 బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో స్టడీ సర్కిల్‎లో 1000 నుంచి 1500 మంది విద్యార్థులకు కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఈ స్టడీ సర్కిల్స్ ద్వారా 50వేల మంది విద్యార్థులకు నేరుగా, మరో యాబై వేల మందికి ఆన్ లైన్ ద్వారా కోచింగ్ ఇస్తామన్నారు. గ్రూప్ 1, గ్రూపు 2, టెట్ కోచింగ్ తీసుకునేవాళ్లకు ఫ్రీ కోచింగ్ తో పాటు నెలకు ఐదువేల స్టైఫండ్ కూడా ఇవ్వనున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులకు ఆరునెలల పాటు రూ. 5000,  గ్రూప్ 2, టెట్ అభ్యర్థులకు 3 నెలల పాటు రూ. 2000 స్టైఫెండ్ అందిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం పరీక్ష నిర్వహిస్తామని.. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తామని గంగుల తెలిపారు. నేటి  నుంచి 16 వరకు ఆన్ లైన్‎లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అభ్యర్థులకు గంగుల సూచించారు.

For More News..

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది

ఎమర్జెన్సీ ఎత్తేసిన లంకాధ్యక్షుడు