సమైక్యవాదమే ఈటల నినాదమా?

సమైక్యవాదమే ఈటల నినాదమా?

సీఎం కేసీఆర్ కు ఘోరీ కడతామంటూ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్.హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు విద్యార్థి నేతలు కరీంనగర్ లో గంగుల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.  ఈ సందర్బంగా మాట్లాడిన గంగుల... ఎందుకు టీఆర్ఎస్ పార్టీకీ, కేసీఆర్ కు ఘోరీ కట్టాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ భార్య జమున సమైక్య రాష్ట్రంలోనే సంతోషంగా ఉన్నామని అన్నారని.. సమైక్య వాదమే ఈటల నినాదమా అని ప్రశ్నించారు. 

కేసీఆర్ కు ఘోరీ కడుతా అన్నప్పుడే ఈటలపై ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. ఈటల లాంటి సమైక్య వాదులకు ఘోరీ కట్టాలన్నారు.బీజేపీ దగ్గర ఈటల తన ఆత్మగౌరవం తాకట్టు పెట్టిండన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని.. ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. హుజురాబాద్ ను డెవలప్ మెంట్ చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈటల సీఎం దగ్గర నిధులు తెచ్చుకోవడంలో విఫలమయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో  ప్రజలు ఎవరికి ఘోరీ కడుతారో ఆలోచించుకోవాలన్నారు.