డబుల్​ బెడ్ రూం ఇండ్లను అమ్మినా.. కిరాయికి ఇచ్చినా వాపస్ ​తీసుకుంటం:మంత్రి హరీష్ రావు

డబుల్​  బెడ్ రూం ఇండ్లను అమ్మినా.. కిరాయికి ఇచ్చినా వాపస్ ​తీసుకుంటం:మంత్రి హరీష్ రావు

సిద్దిపేట, వెలుగు : దాదాపు  రూ.20లక్షల విలువైన డబుల్​బెడ్​రూం ఇండ్లను ఫ్రీగా ఇస్తున్నామని, వాటిని ఎవరు అమ్మినా, కిరాయిలకు ఇచ్చినా వాపస్ తీసుకుంటామని మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. సోమవారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్ లో 300 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్​ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట టౌన్​లోని కేసీఆర్ నగర్ లో నిర్మించిన డబుల్​ బెడ్​రూం ఇండ్ల కోసం అర్హులైన 1500 మందికి ఇదివరకే పట్టాలు పంపిణీ చేశామన్నారు. త్వరలోనే అందరితో కలిసి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహిస్తామన్నారు. సిద్దిపేట టౌన్​లోని పేదల కోసం త్వరలోనే మరో వెయ్యి ఇండ్లు కట్టిస్తామన్నారు.  సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సహకారం అందజేస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఫారుఖ్​ హుస్సేన్ పాల్గొన్నారు.