సర్పంచ్ ఆవేదన.. లక్ష రూపాయలు అందజేసిన మంత్రి

సర్పంచ్ ఆవేదన.. లక్ష రూపాయలు అందజేసిన మంత్రి

మెదక్ (చిన్నశంకరంపేట), వెలుగు: ఓ గ్రామంలో రైతు వేదిక ప్రారంభానికి వచ్చిన మంత్రి హరీష్ రావు.. ఆ గ్రామ స‌ర్పంచ్ ఆవేద‌న విని స్పందించి వెంట‌నే రూ.ల‌క్ష అంద‌జేశారు. ఈ సంఘటన ఆదివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో జరిగింది. మడూర్ సర్పంచ్ కర్రే నరసమ్మ సి.సి. రోడ్డు పనులు పూర్తి చేసి నేటికి 11 నెలలు గడుస్తున్నా బిల్లు రాలేదని, రోడ్డు పనికి చేసిన అప్పుకు మిత్తి 95,000 కట్టానని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి సభా ముఖంగా సర్పంచ్ కు లక్ష రూపాయలు అందించారు. భర్త చనిపోయినప్పటికీ అప్పులు చేసి గ్రామ అభివృద్ధి పనులను పూర్తి చేయడం పట్ల ఆమెను హరీష్ రావు అభినందించారు. సీ సీ రోడ్డు బిల్లు వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు.