సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్ గా 'జైలర్ 2' ' సిద్ధమవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ భారీ ప్రాజెక్టుపై లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి ఒక ప్రత్యేక గీతంలో మెరవబోతున్నట్లు తెలుస్తోంది.
రజనీతో నోరా మాస్ స్టెప్పులు
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి అంటేనే హై-ఎనర్జీ డ్యాన్స్ నంబర్లకు కేరాఫ్ అడ్రస్. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఆమె ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్‌తో కలిసి ఒక భారీ అవుట్‌డోర్ సెట్‌లో, అదిరిపోయే మాస్ బీట్‌కు నోరా స్టెప్పులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు ఎనిమిది రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరగనుందని, ఇది సినిమాలోనే హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది..
తమన్నా వేసిన 'కావాలా' సాంగ్ గతంలో ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. ఇప్పుడు నోరా ఫతేహి రాకతో ఆ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన ఈ 'సౌత్ స్టైల్' అప్‌బీట్ ట్రాక్ 2026లో చార్ట్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'జైలర్ 2' లో రమ్యకృష్ణ
ఈ సీక్వెల్‌లో టైగర్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో రజనీకాంత్ మరింత పవర్ ఫుల్ గాకనిపించనున్నారు. ఈ మూవీలో రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా కీలక పాత్రలను నటిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరామూడు, అన్నా రాజన్ వంటి ప్రముఖ నటులు కూడా జతకలిశారు. అంతేకాకుండా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ల కేమియోలు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే 'హుకుం రీలోడెడ్' వంటి ట్రాక్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్‌గా రజనీకాంత్ కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉందని స్వయంగా రజనీ వెల్లడించారు. ఈ 'జైలర్ 2' చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.
