మీరు షాపులో కొనే కోడిగుడ్లు మంచివా కాదా.. ఇంట్లో ఇలా టెస్ట్ చేసుకోండి.. !

మీరు షాపులో కొనే కోడిగుడ్లు మంచివా కాదా.. ఇంట్లో ఇలా టెస్ట్ చేసుకోండి.. !

ప్రతిఒక్కరి ఇంట్లో గుడ్లు ఉండటం కామన్... అది బ్రేక్  ఫాస్ట్ అయినా, లంచ్ అయినా డిన్నర్ అయినా.. గుడ్లను రకరకాల రెసిపీలలో మనం చేసుకుంటుంటాం.. గుడ్లలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు (Nutrients) పుష్కలంగా ఉంటాయి. అలంటిది  మీరు తినే గుడ్లు మంచిగా ఉన్నాయా లేక పాడయ్యాయా అని ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, బయటకు మామూలుగా కనిపించినా లోపల పాడైపోయే అవకాశం ఉంది. గుడ్ల మంచిగా, ఫ్రెష్ గా ఉన్నాయని తెలుసుకోవడానికి  కొన్ని సింపుల్ కిచెన్ హ్యాక్స్ మీకోసం... 

1. నీటిలో వేసి చూడటం
 గుడ్డు పాతదా లేదా తాజాగా ఉందా అని తెలుసుకోవడానికి ఇదోక  సులభమైన, బెస్ట్  పద్ధతి. ఒక గిన్నెలో చల్లటి నీరు తీసుకుని అందులో గుడ్డును  వేయండి. గుడ్డు తాజాగా ఉంటే గుడ్డు పూర్తిగా కిందకు మునిగి, నిలువుగా కాకుండా అడ్డంగా పడిపోతుంది. కొంచెం పాత గుడ్డు అయితే గుడ్డు కిందకి  మునిగి, నిలువుగా నిలబడుతుంది. ఇలాంటి గుడ్లను ఉడకబెట్టి తొక్క తీయడం ఈజీ. పాడైపోయిన గుడ్డు నీటిపై తేలుతుంది. ఎందుకంటే లోపల గాలి ఎక్కువగా చేరుతుంది, దీన్ని తినడం కంటే  పారవేయడం మంచిది.

2.  వాసన ద్వారా పరీక్ష 
గుడ్డును ముక్కు దగ్గర పెట్టి వాసన చూడండి. తాజా గుడ్డు అయితే వాసన ఉండదు. చాలా మందంగా ఉంటుంది. పాడైపోయిన గుడ్డు అయితే  కుళ్ళిన  వాసన వస్తుంది. ఇలా వాసన వస్తే పారవేయండి. ఏదైనా అనుమానం ఉంటే  కొంచెం గుడ్డు పగులగొట్టి  వాసన చూడండి.  

3. గుడ్డు పెంకును పరిశీలించండి
గుడ్డుపై ఉన్న  పెంకును దగ్గరగా బాగా పరిశీలించి చుడండి. గుడ్డు పెంకుపై  పగుళ్లు ఉంటే  బ్యాక్టీరియా లోపలికి వెళ్లే అవకాశం ఉంది. పగిలిన గుడ్లను తినొద్దు. సన్నగా, జిగటగా లేదా పౌడర్ లాంటి మచ్చలు ఉంటె బూజు లేదా బ్యాక్టీరియాకి సంకేతం, దాన్ని  పారవేయండి.

4.  ఊపి చూడటం 
గుడ్డు లోపల ఉన్న నీలం వినికిడి  ద్వారా తెలుసుకోవచ్చు. గుడ్డును మీ చెవి దగ్గర పట్టుకుని మెల్లగా ఊపండి. తాజా గుడ్డు అయితే ఎటువంటి శబ్దం రాదు లేదా చాలా మందమైన శబ్దం వస్తుంది. లోపలి పచ్చసొన, తెల్లసొన గట్టిగా ఉన్నాయని అర్థం. పాడైన గుడ్డు నీరు కదిలినట్లు శబ్దం వస్తుంది. అంటే తెల్లసొన పలచబడి  నీళ్లలా కదులుతోంది.  

5. పగులగొట్టిన తర్వాత  
గుడ్డు పగులగొట్టిన తర్వాత లోపల జాగ్రత్తగా పరిశీలించండి. ఇందుకు ముందుగా  గుడ్డును ఒక గిన్నెలో పగులగొట్టండి. తాజా గుడ్డు అయితే  పచ్చసొన గుండ్రంగా, చెక్కుచెదరకుండా ఉండాలి. తెల్లసొన మందంగా ఉండి, పచ్చసొనకు అతుక్కుని ఉండాలి. పాత గుడ్డు అయితే పచ్చసొన పలుచగా ఉండి విరిగిపోతుంది. పాడైన గుడ్డులో  తెల్లసొన లేదా పచ్చసొన గోధుమ, గులాబీ, ఆకుపచ్చ లేదా ఏదైనా వింత రంగుకి మారితే  దాన్ని  పారేయండి.

6.  ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేయండి
మీరు కొన్న  గుడ్ల కార్టన్‌పై ఉన్న గడువు తేదీ(ఎక్స్‌పైరీ డేట్ )ని చెక్ చేయండి. గడువు తేదీ ముగిసేలోపు గుడ్లను వాడండి. రిఫ్రిజిరేటర్‌లో 4°C వద్ద లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలో పెడితే  అవి రెండు వారాల వరకు మంచిగా ఉంటాయి. అయినా కొన్నిసార్లు  టెస్ట్ చేయడం మంచిది. 

7. కాంతిలో చూసే పద్ధతి
ఈ పాత పద్ధతిని ఇప్పుడు టార్చ్ లైట్ లేదా స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ లైట్ ఉపయోగించి చేయవచ్చు. చీకటి గదిలోకి వెళ్లి మీ ఫోన్ టార్చ్ లైట్‌కు ఎదురుగా గుడ్డును పట్టుకోండి. తాజా గుడ్డు అయితే పెంకు లోపల గాలి తక్కువగా కనిపిస్తుంది. పచ్చసొన కొంచెం మసకగా (blur) కనిపించాలి. పాత గుడ్డు అయితే  గాలి ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా గుడ్డు పగులగొట్టకుండానే  లోపల ఎలా ఉందొ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.