నంద్యాల జిల్లా: ఆత్మకూరు ఫారెస్ట్ ఏరియాలో పులి ఉచ్చులు .. గందరగోళంలో అధికారులు

నంద్యాల జిల్లా: ఆత్మకూరు ఫారెస్ట్ ఏరియాలో పులి ఉచ్చులు .. గందరగోళంలో అధికారులు

నంద్యాల జిల్లాలో అటవీశాఖ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆత్మకూరు అటవీ డివిజన్... నాగాలూటి రేంజ్ లో పెద్దపులి కోసం వేసిన  ఉచ్చులు లభ్యం కావడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు నల్లమల అడవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

నాగార్జునసాగర్- శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం (NSTR)లో  అటవీ అధికారులు గస్తీ ముమ్మరం చేశారు. అసలు నల్లమల అడవి ప్రాంతంలో అంత డీప్ ఫారెస్ట్ లోకి ఉచ్చులు ఎలా వచ్చాయి వేటగాళ్లు ఎలా చొరబడ్డారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు.  భద్రత కట్టుదిట్టంగా ఉన్న  నల్లమల అడవి ప్రాంతంలో చీమ చిటుకుమన్న ఉన్నతాధికారులకు తెలిసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. అయినా వేటగాళ్లు అధికారుల  కళ్ళు కప్పి  నల్లమల అడవి ప్రాంతంలోకి ఎలా చొరబడ్డారని ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

పెద్దపులిని వేటాడేందుకు ఉచ్చులు వేసిన వారికోసం అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.గతంలో కూడా  నల్లమల అడవి ప్రాంతంలో పులుల వేటగాళ్లు ఉన్నప్రాణి వేటగాళ్లపై నిఘా ఉంచి వాళ్ళ కదలికపై ప్రత్యేక నిఘా పెట్టారు అటవీ శాఖ అదికారులు.