వాస్తు అంటే నివాస గృహం (ఇల్లు) లేదా ప్రదేశం అని శబ్దార్థం. వాస్తు శాస్త్రం అంటే... ఇంటి నిర్మాణాల్లో విధివిధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. ఇందుకు సంబంధించి ఎలాంటి దోషాలకైనా నిష్పత్తి మార్గాలు ఉంటాయి. ఇంట్లో ఎన్ని వాష్ బేసిన్లు ఎన్ని ఉండాలి? పిల్లల స్డడీ రూం ఎక్కడ ఉండాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
ప్రశ్న: మా ఇంట్లో, బాత్రూమ్ తో మొత్తం నాలుగు వాష్ బేసిన్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా హాల్లో ఒక మూలకి మరో బేసిన్ పెట్టించాలి అనుకుంటున్నాం. అప్పుడు మొత్తం అయిదు బేసిన్లు అవుతాయి. దాని వల్ల ఏమైనా దోషం ఉంటుందా? అసలు ఒక ఇంట్లో మొత్తం ఎన్నివాష్ బేసిన్లు ఉండాలి -
జవాబు: ఇంట్లో వాష్ బేసిన్లు ఎన్నైనా ఉండొచ్చు. ఇన్నే ఉండాలి. సరి సంఖ్య, బేసి సంఖ్య అని ప్రత్యేకంగా ఏ నియమాలులేవు. వాటి సంఖ్యతో ఎలాంటి దోషం ఉండదు. ప్రతి రూమ్ లోనూ పెట్టుకో వచ్చు కాకపోతే ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ పెట్టుకుంటే మంచిది అంటే ఈ వాష్ బేసిన్లు దక్షిణ ..ఉత్తర దిక్కు గోడలకు పెట్టుకోవాలి. తూర్పు, పడమర గోడలకు ఉండొద్దు. ఎందుకంటే బేసిన్లో ముఖం కడుక్కుం టున్నప్పుడు ఉమ్మి వేస్తుంటా రు. సూర్యుడు ఉండే తూర్పు.. పడమర దిక్కులవైపు ఉమ్మి వేయొద్దంటారు..
ప్రశ్న: ఈమధ్యే మేము కొంత స్థలం కొనుగోలు చేశాం. తొందర్లోనే అక్కడ ఇల్లు కట్టాలనుకుంటున్నాం. ఇప్పుడున్న పాత ఇంట్లో... పిల్లలు హాల్లోనే చదువుకునే వాళ్లు అయితే కొత్త ఇంట్లో ప్రత్యేకంగా పిల్లలకు స్టడీ రూమ్. కట్టాలనుకుంటున్నాం. దానికి సంబం ధించిన వాస్తు విషయాలను చెప్పగలరు? అంటే బుక్ ర్యాక్ ఎక్కడ పెట్టాలి? అందులో బాత్రూమ్ ఉండవచ్చా? వంటి అంశాలు తెలియజేయగలరు
జవాబు: పిల్లలు చదువుకోవడానికి ప్రత్యేకంగా గదిని నిర్మించాలన్నది మంచి ఆలోచన ఎందుకంటే హల్లో చదువుకుంటే... టీవీ సౌండ్ వచ్చీపో యే వాళ్ల హడావిడితో వాళ్లు చదువు పై శ్రద్ధ పెట్టలేరు. ఇది పిల్లల చదువు, భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి వాస్తు కచ్చితంగా చూడాల్సిందే. స్టడీ రూమ్ అనేది ఇంట్లో ఉత్తర భాగంలో ఉండాలి. అలాగే పిల్లలు చదివేటప్పుడు వాళ్లు ఉత్తరం లేదా తూర్పు దిక్కుకు తిరిగి చదువుకోవాలి. అలా చేస్తే జ్ఞానంపెరుగుతుంది. సరస్వతీ దేవి కటాక్షమూ లభిస్తుంది. బరువుగా ఉండే బుక్ ర్యాక్ లు పేపర్ చార్ట్ లు , బ్లాక్ బోర్డులు మొదలైనవి. ఉత్తరం, తూర్పు గోడలకు పెట్టవద్దు. ఆ దిక్కు న్న గోడలను ఖాళీగా పదిలేయాలి. పడమర, దక్షిణాల్లో ఏ గోడకైనా వాటిని పెట్టుకోవచ్చు. బాత్రూమ్లంటారా! వాటిని స్టడీ రూమ్ లో నిశ్చింతగా కట్టుకోవచ్చు. ఒక్క ఈశాన్యంలో తప్పు ఎక్కడైనా వాటిని నిర్మించుకోవచ్చు.
–వెలుగు,లైఫ్–
