వారఫలాలు: కొత్త సంవత్సరం(2026) ఫిబ్రవరి 1 వ తేది బడ్జెట్ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకా ఈ నెల మూడో తేదీన కుంభరాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం అన్ని రాసులపై ఉంటుంది.. ఏ రాశి వారికి ఎలా ఉంది. ఎవరు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు రాశి ఫలాలను తెలుసుకుందాం...
మేష రాశి: ఈ రాశివారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. ఖర్చులు తగ్గించుకుని ఆదాయాన్ని మదుపు చేయడం జరుగుతుంది. ఆదాయ వృద్దికి సంబంధించి ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం జరుగుతుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృషభరాశి : ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి కూడా ఏ మాత్రం లోటుండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఖర్చుల్ని బాగా తగ్గించు కుంటారు. వ్యాపారస్తులకు అన్నీ విధాలుగా కలసి వస్తుంది. అనుకోకుండా లభాలు పొందుతారు. చేతి వృత్తుల వారికి ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిథునరాశి :ఈ వారం ఈ రాశి వారికి ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. 2026 ఫిబ్రవరి మొదటి వారంలో వీరు అనుకున్న పనులు నెరవేరే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. కొత్త ఆదాయ మార్గాలు వద్ది చేందే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదని పండితులు చెబుతున్నారు.
కర్కాటకరాశి :ఈ రాశి వారు ఈ వారం రిస్క్ తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వారం ప్రారంభంలో చేపట్టిన పనుల్లో ఆలస్యం అయినా.. వారం మధ్యలో పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశాలున్నాయి. వారం చివరిలో కెరీర్ గురించి మంచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. వృత్తి .. ఉద్యోగాల్లో కీలక పనిభారం పెరగడంతో పాటు కీలక బాధ్యతలు పోషించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
సింహ రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరిగినా సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి.. వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి. చేతి వృత్తుల వారికి వారం మధ్యలో అనుకోకుండా ఆర్డర్లు పెరుగుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కన్య రాశి : ఈ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ... వృత్తి పని వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. ప్రతి వ్యవహారంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో పాటు .. ప్రశంసలు లభిస్తాయి. అధికారులకు మీపై నమ్మకం పెరిగి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది.
తులా రాశి : ఈ వారంలో ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు, పొదుపు కూడా వృద్ధి చెందుతుంది. వృథా ఖర్చుల్చి బాగా తగ్గించుకోవడం జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి అనుకూల సమయమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
వృశ్చికరాశి :ఈ రాశి వారికి ఈ వారంలో ఆదాయం పెరగడమే తప్ప తగ్గే అవకాశం ఉండదు. అదనపు ఆదాయాన్ని మదుపులు, పొదుపుల్లో పెట్టడం ద్వారా సద్వినియోగం చేస్తారు. మరింత ఎక్కువగా జీతభత్యాలు ఇచ్చే ఉద్యోగంలోకి మారడానికి బాగా అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరగడానికి అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సురాశి : ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి .. వ్యాపారాల్లో.. స్నేహితులు సహకారంతో ఆశించిన లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ భవిష్యత్తు విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మీకు పుష్కలంగా కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నా అందుకు తగ్గట్టుగా ప్రతిఫలం అందుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.
మకరరాశి : ఈ రాశి వారికి ఈ వానం అన్ని పనులలో విజయాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం . కుటుంబ సభ్యుల పోత్స్రాహం ఉంటుంది. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా మెరుగ్గా ఉంటుంది.ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కుంభ రాశి :ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త అవకాశాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగి పోతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
మీనరాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలతో ముఖ్యమైన వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. కీలన వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు పనిభారం పెరగడంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
