ప్రముఖ వెబ్ సిరీస్ ఫర్జీ, ది ఫ్యామిలీ మ్యాన్స లో సైడ్ హీరోగా చేసిన మాన్ సింగ్‌ని ఉత్తరప్రదేశ్ యాంటీ-నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (UP ANTF) అరెస్ట్ చేసింది. డ్రగ్స్ (MDMA) అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో ఆతన్ని పట్టుకున్నారు.
వివరాల ప్రకారం మాన్ సింగ్ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ నివాసి. ఇతను ముంబైలోని మాల్వానీలో ఉంటున్నాడు. అతను నిషేధిత మాదకద్రవ్యం MDMA సప్లయ్ ఇంకా అక్రమ రవాణాలో చేస్తున్నాడని ఉత్తరప్రదేశ్ యాంటీ-నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (UP ANTF) అదుపులోకి తీసుకుంది.
ANTF అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మాన్ సింగ్ సినిమా రంగంతో తనకున్న పరిచయాన్ని డ్రగ్స్ రవాణాకు అనుకూలంగా వాడుకున్నాడు. అలాగే డ్రగ్స్ కేసులో మాన్ సింగ్ చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. దింతో ANTF సిబ్బంది ముంబైలో అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
మాన్ సింగ్ 2008లో సినిమాల్లో నటించడానికి ముంబై వచ్చానని, అక్కడే అతను ఓ డ్రగ్స్ డీలర్‌ను కలిశానని, అప్పటి నుండి అతనితో కలిసి పనిచేస్తున్నానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ డ్రగ్స్ దందాలో మాన్ సింగ్‌తో పాటు శైలేంద్ర కుమార్, హరిఓం ధాకరే అనే మరో ఇద్దరిని యుపి పోలీసులు గత ఏడాది అక్టోబర్ 3న అదుపులోకి తీసుకున్నారు.
ఈ దర్యాప్తులో మాన్ సింగ్ బ్యాంక్ బదిలీ ద్వారా ఈ ఇద్దరి నుండి డబ్బులు తీసుకున్నాడని, డ్రగ్స్ సప్లయ్ కోసం చాలాసార్లు ఆగ్రాకు వెళ్ళాడని తేలింది. MDMA అక్రమ రవాణాలో మాన్ సింగ్‌తో పాటు ఉన్న మిగతా వారి కోసం ANTF దర్యాప్తు కొనసాగిస్తుంది.
