
సిద్దిపేటలో చెత్త కుప్పలు లేకుండా చేయడమే ఉద్దేశంతో బయో సీఎన్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో ఇవాళ (సోమవారం) bio CNG ప్లాంట్‌ను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్.. బయో సీఎన్జీ ఏర్పాటుకు బలం, బలగం సిద్దిపేట ప్రజలనేని అన్నారు. చెత్తను తడి, పొడి, హానికారక చెత్తను విభజన చేయడంతో బయో సీఎన్జీ ఏర్పాటు సాధ్యం అయ్యిందన్నారు. అభివృద్ధి అంటే..ఆరోగ్య వాతావరణంలో జీవించే గలిగే పరిస్థితులను సృష్టించడమని తెలిపారు. చెత్తను ఆదాయ వనరుగా మార్చుతున్నామని.. bio CNG గ్యాస్ ను పట్టణంలో రెస్టారెంట్లకు సరఫరా చేస్తామన్నారు. మున్సిపల్ వాహనాలకు ఇంధనంగా ఈ గ్యాస్ ను ఉపయోగిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు.