
త్వరలోనే రైతులు పట్టు పంచే కట్టి.. చిరు నవ్వులు చిందించే రోజులు వస్తాయన్నారు మంత్రి హరీశ్ రావు. కరోనా వల్ల కొంత ఆలస్యమైనా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. రైతు రుణ మాఫీ, స్వంత స్థలంలో ఇంటి నిర్మాణం, 57 ఎండ్ల వృద్ధులకు పెన్షన్ హామీలను అమలు చేస్తామన్నారు. పేద ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా కొత్త కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రూ. 600 కోట్లతో కల్లాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించమంటే ఎగతాళి చేసిన రోజులు చూశామన్నారు. వచ్చే దసరాలోగా గౌరవెళ్లి జలాశయంను గోదావరి జలాలతో నింపుతామన్నారు. పాడి రైతులకు రావాల్సిన ఇన్సెంటివ్స్ త్వరలో విడుదల చేస్తామన్నారు హరీశ్.
SEE MORE NEWS