డిసెంబర్ లో గా వ్యాక్సినేషన్ పూర్తి చేయండి

డిసెంబర్ లో గా వ్యాక్సినేషన్ పూర్తి చేయండి

డిసెంబర్ లోగా కరోనా  వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ఆయన అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి మొదటి డోస్‌, రెండో డోస్‌ ఎంత మంది తీసుకున్నారనే వివరాలను సేకరించాలని సూచించారు. ANMలు, ఆశాలు, డాక్టర్లు  గ్రామస్థాయి సబ్‌ సెంటర్‌ స్థాయి, పీహెచ్‌సీ స్థాయిలో ప్రణాళికలు వేసుకొని ప్రతి ఒక్కరు రెండు డోసుల కరోనా  టీకా వేసుకునేలా చూడాలని తెలిపారు.

ప్రజల్లో టీకాపై ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేయాలని తెలిపారు మంత్రి హరీశ్. ప్రత్యేకంగా కాలేజీ క్యాంపస్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు,స్కూల్స్ , ప్రైవేట్‌ కార్యాలయాలు, మార్కెట్లపై దృష్టి సారించాలన్నారు. అక్కడే వారికి వ్యాక్సిన్‌ కార్యక్రమం చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.55 కోట్ల డోసులు వేయాల్సి ఉండగా..ఇప్పటి వరకు 3.60 కోట్ల డోసులు వేశామని, మరో 1.90 కోట్లు వేయాల్సి ఉందన్నారు.