
- గాల్ బ్లాడర్ స్టోన్‌కు ఈజీ ట్రీట్మెంట్పై దృష్టి పెట్టాలి
- టీచింగ్ హాస్పిటళ్ల పనితీరుపై సమీక్షలో మంత్రి సూచన
హైదరాబాద్, వెలుగు: జిల్లాల్లోని టీచింగ్ఆసుపత్రుల్లోనే అన్ని రకాల స్పెషాలిటీ ట్రీట్ మెంట్లు అందించాలని, పేషెంట్లను అనవసరంగా వేరే ఆస్పత్రులకు రిఫర్ చేయొద్దని అధికారులు, డాక్టర్లకు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆదివారం ఆయన తన ఇంటి నుంచి డీఎంఈ (డైరెక్టరేట్ఆఫ్మెడికల్ ఎడ్యుకేషన్) పరిధిలోని టీచింగ్ హాస్పిటళ్ల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈమధ్య కాలంలో గాల్‌బ్లాడర్ స్టోన్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, ఆ సమస్యకు మరింత కచ్చితత్వంతో ఈజీగా ట్రీట్మెంట్ఇచ్చే పద్ధతులపై గాంధీ, ఉస్మానియా డాక్టర్లు స్టడీ చేయాలని మంత్రిసూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో టిఫా స్కానింగ్ పరికరాలను ఏర్పాటు చేశామని, గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల పరీక్షలు అందేలా చూడాలని ఆదేశించారు. గర్భిణులకు అవసరం లేకున్నా సిజేరియన్ డెలివరీలు చేయొద్దని, నార్మల్ డెలివరీలను పెంచాలని సూచించారు. ఇన్ఫెక్షన్కంట్రోల్ యూనిట్లపై ప్రతి సోమవారం ఆర్ఎంవోలు, సూపరింటెండెంట్లు రివ్యూ చేయాలన్నారు. దవాఖాన్లలో ఇన్ఫెక్షన్సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు చెక్‌చేయాలని, స్టెరిలైజేషన్‌లో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.
మందులన్నీ ఆస్పత్రుల్లోనే ఇయ్యాలె..
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్చేసే సమయంలో పేషెంట్‌కు అన్ని రకాల మందులు ఇవ్వాలని అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. ఆసుపత్రుల్లో మూడు నెలలకు సరిపడా మందులు స్టాక్ ఉంచుకోవాలని సూచించారు. ‘‘డాక్టర్లు, నర్సులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోనూ సిబ్బంది అందుబాటులో ఉండాలి. మెడికల్ పరికరాలు పాడైతే గంటలోనే రిపేర్చేసేలా పీఎంయూ (ప్రోగ్రామ్ మేనేజ్మెంట్యూనిట్) విధానం తీసుకొచ్చాం. దీన్ని సద్వినియోగం చేసుకొని పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చూడాలి. అవసరమైతే అన్ని దవాఖాన్లలోనూ రాత్రి టైంలో కూడా రూల్స్ప్రకారం పోస్టుమార్టం చేయాలి. ప్రతి ఆస్పత్రికి 25 నుంచి 30 మంది సీనియర్ రెసిడెంట్లను కేటాయించాం” అని చెప్పారు. ఈ సమావేశంలో హెల్త్సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.