కొలుగూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

కొలుగూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

సిద్ధిపేట: రాష్ట్రంలోనే కొలుగూర్ గ్రామాన్ని ఆదర్శం గ్రామంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా గజ్వెల్ మండలంలో మంత్రి  హరీష్ రావు,  ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా కొలుగూర్ గ్రామంలో నిర్వహిస్తున్న పరిశుభ్రత పనుల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో కొలుగూర్ గ్రామాన్ని దత్తత తీసుకొమని గ్రామస్తులంతా కోరారని, వారి కోరిక మేరకే  గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. అందుకే మంత్రి అయిన మొదటి సారి మీ కొలుగూర్ గ్రామానికి వచ్చానని గ్రామస్తులనుద్దేశించి అన్నారు.

పాత గోడలు, ఇండ్లు కూల్చివేస్తే వారికి కొత్త ఇల్లు కట్టుకోడానికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి జూట్ బ్యాగ్ లు వాడాలని, ప్లాస్టిక్ వద్దు జూట్ బ్యాగ్ లు ముద్దు అనే నినాదం అందరిలో రావాలని పిలుపునిచ్చారు.

25 వ తేదీన తిరిగి గ్రామానికి వస్తానని,  గ్రామాన్ని శుభ్రం చేసినట్లయితే 500 వందల తులసి, వేప చెట్లు తీసుకొని వస్తానని…ఇంటికి రెండు చెట్లు ఇస్తానన్నారు హరీష్ రావు. గ్రామస్తుల ఉత్సాహం చూస్తుంటే కొలుగూర్ త్వరలోనే ఆదర్శ గ్రామంగా, స్వచ్చ గ్రామంగా తయారవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కొలుగూర్ గ్రామానికి వచ్చి గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు హరీష్ కు ధన్యవాదాలు తెలిపారు. మన ఇల్లును శుభ్రం చేసుకోవడంతో పాటు గ్రామాన్ని కూడా శుభ్రం చేయాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.

Minister Harishrao comments at Siddipet District