పాత అంబులెన్స్‌‌‌‌ల స్థానంలో కొత్తవి..మంత్రి హరీశ్‌‌‌‌రావు

పాత అంబులెన్స్‌‌‌‌ల స్థానంలో కొత్తవి..మంత్రి హరీశ్‌‌‌‌రావు
  •     300 అమ్మ ఒడి వాహనాలు కొంటం: హరీశ్‌‌‌‌రావు

హైదరాబాద్, వెలుగు: అంబులెన్స్‌‌‌‌లు, అమ్మ ఒడి వాహనాలు, పార్థివ వాహనాల సంఖ్య పెంచుతామని మంత్రి హరీశ్‌‌‌‌రావు ప్రకటించారు. ఖరాబైన 204 అంబులెన్స్‌‌‌‌లను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నందున, వాటి స్థానంలో కొత్తవి కొనాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. గర్భిణులు, బాలింతలను దవాఖాన్లకు, దవాఖాన్ల నుంచి ఇండ్లకు చేరవేసేందుకు 300 అమ్మ ఒడి వాహనాలను కొనుగోలు చేస్తున్నామని, వచ్చే నెల మొదటి వారానికల్లా వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు. 

ఇక దవాఖాన్లలో చనిపోయిన వారి దేహాలను ఇండ్లకు చేర్చేందుకు 34 పార్థీవ వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు అంబులెన్స్‌‌‌‌, ఇతర వాహన సౌకర్యాలపై మంత్రి బుధవారం రివ్యూ చేశారు. వాహనాల పనితీరు, రిపేర్లు, మెయింటెనెన్స్ వంటివి పర్యవేక్షించి రిపోర్ట్ మెయింటైన్ చేయాలని, కాలం చెల్లిన వాహనాలను వెంటనే తొలగించి నూతన వాహనాలను వాటి స్థానంలో చేర్చాలని, గర్భిణులకు అన్ని రకాల వసతులు కల్పించే విధంగా వాటిని రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.