ఆర్మూర్, వెలుగు : ఈవ్ టీజింగ్కు ఎవరైనా పాల్పడితే షీటీంకు సమాచారం ఇవ్వాలని ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ సూచించారు. శనివారం ఆర్మూర్ టౌన్ లోని గర్ల్స్ జూనియర్ కాలేజ్ లో క్రైమ్, మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్వో మాట్లాడుతూ షీ టీంకు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
ఈవ్‌టీజింగ్‌కు గురైన బాధితులకు రక్షణ కల్పిస్తామన్నారు. షీ టీం నెంబర్8712659795కు, డయల్100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్‌కోడ్ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎంఎస్వీ ప్రసాద్ , సబ్ డివిజన్ షీ టీం కానిస్టేబుల్స్ విఘ్నేష్, సుమతి తదితరులు పాల్గొన్నారు.
