
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. భారీ వర్షాలపై అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు అధికారులతో ఫోన్ లో సమీక్షించారు. వరద ఉధృతి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలతో పాటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.