మిలటరీ వల్లే మనమంతా ప్రశాంతంగా జీవిస్తున్నాం

మిలటరీ వల్లే మనమంతా ప్రశాంతంగా జీవిస్తున్నాం

సూర్యాపేట: దేశ రక్షణలో సైనికుల పాత్ర అమోఘమని, వారి వల్లే మనందరం ప్రశాంతంగా నిద్రపోతున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగరం మండలం డీ కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి పవన్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా ఆయనను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... డీ కొత్తపల్లికి చెందిన పవన్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందడం అభినందనీయమన్నారు. అటువంటి వృత్తిలో రాణిస్తూ ఉన్నత స్థానానికి చేరుకోవడం అనిర్వచనీయమైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. మిలటరీలో చేరిన వారికి సహజంగానే ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న సంకల్పం ఉంటుందని, ఆ సంకల్పానికి తగినట్లుగానే అవకాశాలు ఉంటాయన్నారు. అటువంటి అవకాశాలను అందిపుచ్చుకున్నవారే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు.