
హైదరాబాద్, వెలుగు: కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం మంచి పరిణామమని, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కాళోజీ కథల పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రచురించిన కాళోజీ కథల పుస్తకా న్ని సోమవారం సెక్రటేరియెట్ లో మంత్రి జూపల్లి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సాహిత్యానికి కాళోజీ చేసిన కృషిని ఆయన కొనియాడారు. ‘నా గొడవ’ అనే పుస్తకంలో కాళోజీ రాసిన కవిత్వమే కాకుండా సాహిత్యంలోని అనేక అంశాలను ఆయన స్పృశించారని చెప్పారు. తెలంగాణ భాషకు కాళోజీ చేసిన కృషి గొప్పదని పేర్కొన్నారు.