
- మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటై బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. గురువారం హైకోర్టు వద్ద జూపల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘కోర్టులో కేసులు వేయించింది బీఆర్‌ఎస్ పార్టే. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. మేము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. శాస్త్రీయంగా, సాంకే తికంగా, సమగ్రంగా తెలంగాణ కులగణ చేపట్టాం. తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారు. రాహూల్ గాంధీ అలోచనలకు తగ్గట్టు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో పక్కాగా బీసీ కులగణను పూర్తి చేసింది’’అని జూపల్లి పేర్కొన్నారు.