- వెబ్‌సైట్ ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో హాల్ బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రవీంద్రభారతి కొత్త వెబ్‌సైట్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాంకేతికతను వినియోగించుకోవడం వల్ల బుకింగ్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉంటుందన్నారు.
ఈ వెబ్‌సైట్ ద్వారా రవీంద్రభారతిలోని మెయిన్, మినీ హాల్స్, జయరాజ్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. 90 రోజుల ముందే స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, ఏవో గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
