సుద్దాల హనుమంతుకు మంత్రి జూపల్లి నివాళి

సుద్దాల హనుమంతుకు మంత్రి జూపల్లి నివాళి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పోరాట యోధుడు, ప్రజాకవి హనుమంతు తన సాహిత్యంతో  ప్రజల్లో స్ఫూర్తి  నింపారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  సుద్దాల హనుమంతు వర్ధంతి సందర్భంగా రవీంద్రభారతిలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు మంత్రి జూపల్లి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రజాస్వామ్య పోరులో సుద్దాల స్ఫూర్తి ఇమిడి ఉందని గుర్తుచేశారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.  రాష్ట్ర కవులు, కళాకారులు, సాహితీవేత్తల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని జూపల్లి పేర్కొన్నారు.