భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు  : ఆర్అండ్ బీ శాఖ

భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు  : ఆర్అండ్ బీ శాఖ
  • సరస్వతి అంత్య పుష్కరాలకు మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే సరస్వతి అంత్య పుష్కరాలకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. గురువారం హైదరాబాద్‌‌‌‌లోని మంత్రుల నివాస సముదాయంలోని  క్యాంపు ఆఫీసులో వారు మంత్రిని కలిశారు. దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, అర్చకులు శాలువా కప్పి ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. గతేడాది పుష్కరాలకు భక్తులు భారీగా తరలొచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్అండ్ బీ శాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.