
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పైచర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. సవాళ్లు ,ప్రతిసవాళ్లు విసురుకున్నారు. జగదీష్ రెడ్డిపై కోమటరెడ్డి విరుచుకుపడ్డారు. జగదీష్ రెడ్డికి నల్గొండలో క్రిమినల్ రికార్డ్ ఉందని ఆరోపించారు. జగదీష్ రెడ్డిపై ఆరోపణలు నిరూపించకపోతే తన ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు కోమటిరెడ్డి. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు జగదీష్ రెడ్డి. కోమటి రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నానని చెప్పారు జగదీష్ రెడ్డి
అసెంబ్లీలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు
- జగదీశ్ రెడ్డి జీవితమంతా కిరాయి హత్యలు, దొంగతనాలు
- జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగారు
- జగదీశ్ రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపిస్తా
- ఆరోపణలు నిరూపించకుంటే ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తా
- సూర్యపేట రైస్ మిల్లులో జగదీష్ రెడ్డి దొంగతనం చసిండు
- లక్షా 80 వేల కేసులో జగదీష్ రెడ్డి ముద్దాయి
- రాంరెడ్డి హత్యకేసులో ఏ6 జగదీశ్ రెడ్డి
- ఓ హత్యకేసులో ఏ2 నిందితుడు జగదీశ్ రెడ్డి
- నల్గొండలో జగదీష్ రెడ్డికి క్రిమినల్ రికార్డ్ ఉంది
- మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు
ALSO READ : BHEL నుంచి సివిల్ పనులను బీఆర్ఎస్ బినామీలకే కట్టబెట్టి దోచుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కామెంట్స్
- కోమటిరెడ్డి తన ఆరోపణలు నిరూపించాలి
- కోమటిరెడ్డి చాలెంజ్ ను స్వీకరిస్తున్నా
- నాపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే అసెంబ్లీలో ముక్కు నేలకు రాస్తా
- నాపైన చేసిన ఆరోపణలను నిరూపించకపోతే సీఎం రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి
- కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి
- కాంగ్రెస్ నాపై 3 హత్యకేసులు పెట్టింది
- మూడు కేసుల్లో కోర్టు నన్ను నిర్దోషిగా తేల్చింది
- సభలో నాపై ఆరోపణలపై హస్ కమిటీ వేయాలి
- మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే
- ఇండియా బుల్స్ సంగతి మాకు తెల్వదు
- కేసీఆర్ కాలిగోటికి కాంగ్రెస్ నేతలు సరిపోరు
- చర్లపల్లి జైలుని రేవంత్ గుర్తుచేస్కుంటున్నారు
- నాకు జైలు అనుభవం ఉంది కాని ఉద్యమం టైంలో వెళ్లిన రోజు గుర్తు ఉంది.
- కానీ రేవంత్ కు మాత్రం చర్లపల్లి జైల్ ఎందుకు గుర్తుకువస్తుందో
- సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు భుజాలు తడుముకున్నారు
- రేవంత్ రెడ్డిలాగా సంచులు మోసుకుని వెళ్లి దొరికిపోలేదు