BHEL నుంచి సివిల్ పనులను బీఆర్ఎస్ బినామీలకే కట్టబెట్టి దోచుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

BHEL నుంచి సివిల్ పనులను బీఆర్ఎస్ బినామీలకే కట్టబెట్టి దోచుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ లీడర్లపై అసెంబ్లీలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకుని రాష్ట్రానికి అన్యాయం చేశారని చెప్పారు. పవర్ ప్లాంట్ లు బీహెచ్ఈఎల్ కు ఇస్తున్నామని చెప్పి వాళ్ల నుంచి సివిల్ కాంట్రాక్టులు వీళ్ల బినామీలకు ఇప్పించి కమిషన్లు తీసుకున్నారని అన్నారు. సబ్ క్రిటికల్ నుంచి సూపర్ క్రిటికల్ కు అప్ గ్రేడ్ చేయాలని కేంద్రం సూచిస్తే కమిషన్స్ కు కక్కుర్తి పడి సబ్ క్రిటికల్ యంత్రాగాన్ని కొనుగోలు చేసి వాటికి టెండర్లు పిలిచి వాటితో పవర్ ప్లాంట్ కట్టించారని చెప్పారు. 

also read : సాయంత్రంలోగా కొత్త ఛైర్మన్ వస్తరు.. భయమెందుకు.?: సీఎం రేవంత్

దీంతో ఎప్పుడూ భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఎదో ఓ సాంకేతిక సమస్య తలెత్తుతూ వస్తుందని చెప్పారు. రెండున్నర ఏండ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును తొమ్మిదున్నర ఏండ్ల గడుస్తున్న పూర్తి చేయలేదని విమర్శించారు. గుజరాత్ కు చెందిన కంపెనీ నుంచి రూ. 1000 కోట్లు కమిషన్లు తీసుకుని పవర్ ప్రాజెక్టులు కట్టారని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా ఇలాగే చేశారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. నిజాలు చెబితే బుకాయించే పనులు చేస్తున్నారని సోనియా దయతో జైపాల్ రెడ్డి కృషితో ఇప్పుడు తెలంగాణ  వెలుగులు చిమ్ముతుందని తెలిపారు.