
విద్యుత్ కొనుగోళ్లపై జ్యూడిషియల్ కమిషన్ విచారణ జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ పై అసెంబ్లీలో చర్చ సందర్బంగా మాట్లాన రేవంత్ రెడ్డి. విద్యుత్ విచారణ కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ కోర్టుకెళ్లారని అన్నారు. సుప్రీం కోర్టు విద్యుత్ కమిషన్ ను రద్దు చేయలేదని.. విచారణ కమిషన్ ఛైర్మన్ ను మార్చి విచారణ చేయాలని సూచించిందన్నారు. కమిషన్ వివరాలు అడిగితే కేసీఆర్ ఇవ్వలేదన్నారు.
ALSO READ : అసెంబ్లీలో పవర్ వార్... రాజగోపాల్ రెడ్డి vs జగదీశ్ రెడ్డి
విభజన జరిగేటప్పుడు తెలంగాణకు 54 శాతం విద్యుత్ కేటాయింపులు చేశారని చెప్పారు. విద్యుత్ కేటాయింపుల కోసం జైపాల్ రెడ్డి కృషి చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రారంభించిన విద్యుత్ ప్లాంట్లను కేసీఆర్ పూర్తి చేశారన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క యూనిట్ కూడా సోలార్ పవర్ ఉత్పత్తి చేయలదేన్నారు. విద్యుత్ విచారణపై బీఆర్ఎస్ నేతలకు భయమెందుకని ప్రవ్నించారు రేవంత్. విద్యుత్ కొనుగోళ్లలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు