లగ్జరీ ఫీచర్లతో అదిరిపోయిన కొత్త కుషాక్ SUV.. రూ.15 వేలకే బుకింగ్స్ షురూ.. 5 స్టార్ సేఫ్టీ

లగ్జరీ ఫీచర్లతో అదిరిపోయిన కొత్త కుషాక్ SUV.. రూ.15 వేలకే బుకింగ్స్ షురూ.. 5 స్టార్ సేఫ్టీ

ఆటోమొబైల్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'స్కోడా కుషాక్ 2026' భారత మార్కెట్లోకి వచ్చేసింది. తనదైన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో పాటు ఈసారి సరికొత్త ఫీచర్లు, మరింత స్టైలిష్ లుక్‌తో ఈ మిడ్-సైజ్ SUV రూపుదిద్దుకుంది. కేవలం రూ.15వేలు చెల్లించి ఈ కారును ఇప్పుడే ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి 2026 చివరి నాటికి డెలివరీలు ఉండనున్నాయి.

కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్ స్కోడా మోడరన్ సాలిడ్ డిజైన్ లాంగ్వేజ్‌ను అనుసరించింది. ముందు భాగంలో వెలుగులీనే లైట్ బ్యాండ్‌తో కూడిన రీ-డిజైన్డ్ గ్రిల్, కొత్త LED హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి. వెనుక వైపు కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, మెరిసే 'SKODA' అక్షరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక అన్ని వేరియంట్లలోనూ అలాయ్ వీల్స్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించడం విశేషం. సిమ్లా గ్రీన్, స్టీల్ గ్రే, చెర్రీ రెడ్ వంటి సరికొత్త రంగుల్లో లభ్యం కానుంది.

ఇంజిన్ అండ్ పెర్ఫార్మెన్స్: 
మెకానికల్ పరంగా చూస్తే.. 1.0 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్‌తో పాటు తొలిసారిగా ఈ సెగ్మెంట్లో 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పరిచయం చేశారు. ఇది 115PS పవర్, 178Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక పవర్‌ఫుల్ డ్రైవింగ్ కోరుకునే వారి కోసం 1.5 లీటర్ TSI ఇంజిన్ (150PS/250Nm) అందుబాటులో ఉంది. దీనికి 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. భద్రత కోసం 1.5 లీటర్ మోడల్‌లో నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లను అందించారు.

ఫీచర్స్ అండ్ కంఫర్ట్: 
ఇంటీరియర్‌లో లగ్జరీకి పెద్దపీట వేశారు. కుషాక్‌లో మొదటిసారిగా 'పనోరమిక్ సన్‌రూఫ్'ను ప్రవేశపెట్టారు. ప్రయాణికుల సౌకర్యం కోసం వెనుక సీట్లకు మసాజ్ ఫంక్షన్ ఫీచర్‌ను జోడించడం ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారి. డ్యాష్‌బోర్డ్‌పై 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, గూగుల్ ఆటోమోటివ్ AI వాయిస్ కంట్రోల్స్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. వెలుతురును బట్టి అడ్జస్ట్ అయ్యే వెంట్లేటెడ్ సీట్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు కూడా ఇందులో ఉన్నాయి.

సేఫ్టీ అండ్ వారంటీ: 
ఇక సేఫ్టీ విషయంలో రాజీ లేకుండా గ్లోబల్ NCAPలో '5-స్టార్' రేటింగ్ సాధించిన ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తున్నాయి. 'స్కోడా సూపర్ కేర్' ప్యాకేజీ కింద 4 ఏళ్ల వారంటీ, 4 ఏళ్ల రోడ్ సైడ్ అసిస్టెన్స్, నాలుగు ఉచిత సర్వీసులను కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీని ధరలు సుమారు రూ.10లక్షల 70 వేల నుంచి రూ.19 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధర ఉండే అవకాశం ఉంది. ఈ స్కోడా కారు మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుందని ఆటో నిపుణులు అంటున్నారు.