మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం: మంత్రి వివేక్

మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం: మంత్రి వివేక్

మంచిర్యాల జిల్లా  చెన్నూరులో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొన్న  స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేశారు  మంత్రి వివేక్ వెంకటస్వామి.  

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. స్వయం సహాయక సంఘాల మహిళలు అభ్యున్నతి సాధించేలా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తుందన్నారు. చెన్నూరులో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఒక పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  చెన్నూరు మున్సిపాలిటీలో ఇంకా ఎక్కువ సహాయక సంఘాలలో మహిళలు జాయిన్ అవ్వాలని సూచించారు. ప్రజా పాలనతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.

►ALSO READ | సిట్ విచారణకు హరీశ్..జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర భారీ బందోబస్తు

చెన్నూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.  స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంకా ఎక్కువ కష్టపడి ఉన్నతి సాధించాలి. చెన్నూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతానని చెప్పారు.