Good Health: వీటిని ఆహారంలో చేర్చుకోండి.. 60 ఏళ్లలో కూడా.. 20 ఏళ్ల వాళ్ల వలే గంతులేస్తారు..

Good Health:  వీటిని ఆహారంలో చేర్చుకోండి.. 60 ఏళ్లలో కూడా.. 20 ఏళ్ల వాళ్ల వలే  గంతులేస్తారు..

సరైన ఆహారంలో సీజనల్ గా వచ్చే జలుబు, వైరల్ జ్వరాలకు చెక్ పెట్టొచ్చు. వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలు శరీరానికి అవసరమైన పోషకాలు అందించి, రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. వీటిని రోజు ఆహారంలో చేర్చితే  అరవై లో కూడా 20 ఏళ్ల మాదిరిగా గంతులేస్తారు..! 

వెల్లుల్లి : దీనిలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బ తింటే జలుబు, ఇతర వైరల్ జబ్బులు దరిచేరవు.

యోగర్ట్ లస్సీ : శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉత్పత్తికి ప్రో బయోటిక్ ఫుడ్ అయిన లస్సీ, యోగర్ట్ ఎంతో అవసరం.   ఇవి జీర్ణక్రియ సాఫీగా ఉండేలా చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి వాపు, ఇన్ఫెక్షన్లు నివారించడమే కాకుండా జీవక్రియను నియంత్రిస్తాయి. 

అల్లం  : శరీరానికి శక్తిని ఇస్తుంది. శరీరంలో వేడిని కలిగించి, శ్వాస సంబంధ ఇబ్బందులను తగ్గిస్తుంది. అల్లం టీ తాగడం, అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా
ఆరోగ్యంగా ఉండొచ్చు. 

బచ్చలి, క్యాబేజీ, బ్రకోలి : ఈ సీజన్​ లో  ఆకుకూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటిలో విటమిన్  ఏ...సీ ... ఈ అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

నిమ్మజాతి పండ్లు: నారింజ, నిమ్మ,టొమాటో, అనాస లాంటి పండ్లలో విటమిన్​ సి ఎక్కువుగా ఉంటుంది. విటమిన్​ సి  రోగనిరోధకశక్తిని పెంచుతుంది.  నిమ్మజాతి పండ్లలో ఉండే యాంటీ అక్సిడెంట్లు శరీరంలోని విష పదార్థాలను, మలినాలను తొలగిస్తాయి.

పుట్టగొడుగులు :  వీటిలో శరీరానికి కావలసిన విటమిన్​ డి .. ఇతర పోషకాలు ఉంటాయి.  వీటిని సూప్​ లు.. సలాడ్​ గా తీసుకుంటే ప్రయోజనంగా ఉంటుంది.

►ALSO READ | జ్యోతిష్యం: వందేళ్ల తరువాత మకరంలోకి మూడు పవర్ ఫుల్ గ్రహాలు.. రుచక మహా పురుష యోగంతో.. నాలుగు రాశుల వారికి ఊహించని మార్పులు