నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి గ్రీన్​సిగ్నల్​ : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి గ్రీన్​సిగ్నల్​ : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి గ్రీన్​ సిగ్నల్​ఇచ్చారు. ఇప్పుడున్న కలెక్టరేట్​లో గదులు ఇరుకుగా ఉన్నందున అన్ని సౌకర్యాలతో విశాలమైన భవాన్ని నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డిను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఇప్పుడున్న కలెక్టరేట్​లోని స్థలంతోపాటు ఆర్డీవో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థలాన్ని కలెక్టర్ పరిశీలిం చారు.

ఆర్డీవో ఆఫీసు నుంచి బీఎస్ఎన్ఎల్​క్వార్టర్స్​వరకు ఖాళీ జాగా ఉంది. పొరుగు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ల మాదిరిగానే స్టేట్ చాంబర్​వంటి నిర్మాణాలు కొత్త భవనంలో ఉండేలా చర్యలు తీసుకోనున్నల్లు కలెక్టర్​తెలిపారు. ఆయన వెంట ఆర్కిటెక్చర్​ఉషారెడ్డి, ఆర్​అండ్​బీ అధికారులు ఉన్నారు.