- అప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల మధ్య రోడ్డు కనెక్టివిటీ పెరిగినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ సమిట్2025 కార్యక్రమంలో భాగంగా రెండో రోజు మంగళవారం ఆయన ప్యూచర్ సిటీలో ‘కనెక్టెడ్ తెలంగాణ - ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్‌అండ్ అర్బన్ - రూరల్ కనెక్టివిటీ’ అనే అంశంపై జరిగిన ప్యానెల్ డిస్కషన్ లో మాట్లాడారు. " రోడ్లు, రైల్వేలు, విమానయానం, మౌలిక వసతులు, కరెంట్, ఆరోగ్యం, లాజిస్టిక్స్స్ వంటి అన్ని రంగాల్లో ఏకకాలంలో ప్రగతి సాధించడమే ప్రభుత్వ లక్ష్యం.
అందుకే రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా రోడ్ సెక్టర్ పాలసీని తీసుకువచ్చాం. రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరగాలి. అన్ని వైపులా రోడ్డు, రవాణా కనెక్టివిటీ మెరుగుపడాలి. మానవాభివృద్ధి సూచీలు పెరగాలి.
భవిష్యత్తు మొబిలిటీకి సరిపోయే సౌలతుల విషయంలో కొత్త ఆలోచనలు, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. హైదరాబాద్ నుంచి, దేశం మొత్తానికి బలమైన కనెక్టివిటీ ఇవ్వాలనే అంశాలపై ఫోకస్పెట్టాం. జాతీయ రహదారులతో పారిశ్రామిక కారిడార్‌లకు, వ్యవసాయ మార్కెట్లకు, టూరిజం సర్క్యూట్లకు, లాజిస్టిక్స్ చైన్‌లకు కనెక్టివిటీ పెరుగుతున్నది " అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.
ఆర్అండ్ బీ శాఖ ప్రిన్సిపల్సెక్రటరీ వికాస్ రాజ్మాట్లాడుతూ..ఆర్ఆర్ఆర్, దానికి అనుసంధానంగా నిర్మించబోయే రేడియల్‌రోడ్లు, హ్యామ్ రోడ్ల నాణ్యత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని చెప్పారు.విమానయాన రంగంలోనూ రాష్ట్రాన్ని దేశంలోనే టాప్ ఎయిర్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఈ సెషన్లో ఆర్ అండ్ బీ శాఖ ఇన్చార్జ్ ఈఎన్సీ మోహన్ నాయక్, ఇన్చార్జ్ సీఈలు రాజేశ్వర్ రెడ్డి, జయభారతి, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.

